Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లను త్వరలో ఆవిష్కరించనున్నది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ (Samsung Galaxy S24 ) చిప్సెట్తో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ వస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్లు భారత్ మార్కెట్లోకి వస్తాయని తెలుస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్24+, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్లు కూడా వస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా మోడల్ పూర్తిగా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుంది. గెలాక్సీ ఎస్24 ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ లేదా ఎక్స్ నోస్ 2400 ఎస్వోసీ చిప్సెట్తో వస్తుందని భావిస్తున్నారు. అల్యూమినియం స్థానే టైటానియం ఫ్రేమ్స్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్లు వస్తాయని తెలుస్తోంది.