Samsung Galaxy S23 Lime | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ ఫోన్ తీసుకొచ్చింది. ఇంతకు ముందే శాంసంగ్ తన గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. తొలుత మార్కెట్లోకి తెచ్చిన గెలాక్సీ ఎస్23 ఫోన్ క్రీమ్, గ్రీన్, లావెండర్, ఫాంటోమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్ ఉంటుంది. 6.1 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే కలిగి ఉంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సర్ తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. మంగళవారం నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటది.
గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజీ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.74,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.79,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుదారులకు ప్రధాన బ్యాంకు ఖాతాల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 క్యాష్ బ్యాక్ తోపాటు మొత్తం రూ.8000 అప్ గ్రేడ్ బోనస్ ఇస్తుంది. అంటే 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.61,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.66,999లకు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లలోని ఫీచర్లే లైమ్ కలర్ వేరియంట్ ఫోన్ లోనూ వస్తాయి. 6.1 -అంగుళాల ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే విత్ అప్ టూ 120 హెర్జ్ట్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 విత్ వన్ యూఐ5.1 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సర్ తోపాటు 12మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సర్ ఉంటుంది.
గెలాక్సీ ఎస్23 లైమ్ కలర్ వేరియంట్ ఫోన్..డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 68 రేటింగ్, 3900 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్స్ 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ అండ్ 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ ఫెసిలిటీతో వస్తున్నది.