Samsung Galaxy S23 FE | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ గత నెలలో తన ప్రీమియం ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎక్స్‌నోస్ 2200 ఎస్వోసీ చిప్సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా తీసుకొచ్చింది. 25 వాట్ల చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో మార్కెట్లోకి ఎంటరైన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23FE) ఫోన్ మరో రెండు కలర్స్-ఇండిగో, టాంగరైన్ ల్లో వస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ క్రీమ్, గ్రాఫైట్, మింట్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. తాజాగా ఇండిగో, టాంగరైన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, శాంసంగ్ వెబ్సైట్లో మాత్రమే ఇండిగో, టాంగరైన్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23ఎఫ్ఈ ఫోన్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ 6.4 అంగుళాల డైనమిక్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నదీ ఫోన్. 50-మెగా పిక్సెల్ ఓఐఎస్ సపోర్టెడ్ ప్రైమరీ సెన్సర్, 12-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్డ్రావైడ్ లెన్స్, 8-మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 10-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది.
25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23ఎఫ్ఈ ఫోన్ వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.