జ్యోతినగర్, సెప్టెంబర్ 12 : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్టు స్టేజ్-2 కింద (3×800 మెగావాట్లు) నిర్మించనున్న 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగుపడింది. శనివారం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సమంత ముఖ్యఅతిథిగా హాజరై బీహెచ్ఈఎల్ సంస్థ అధికారులతో కలిసి ప్రధాన ప్లాంటు ప్రాంతంలో సైట్ లెవెలింగ్ పనుల ప్రారంభోత్సవ పూజ నిర్వహించారు.
తెలంగాణ స్టేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించి ఇదివరకు రూ.13,500 కోట్లకు మెయిన్ ప్లాంటు బాయిలర్, టర్బైన్, జనరేటర్ టెండర్ అవార్డు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ నిర్మించనున్న ప్రాధాన ప్లాంటుకు సైట్ లెవెలింగ్ పనుల ప్రారంభంతో స్టేజ్-2 ప్రాజెక్టుకు ముందడుగు పండినట్లయింది.