Samsung Galaxy M35 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన మిడ్ రేంజ్ శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో రూ.19,999లకు ఆవిష్కరించింది. ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. గెలాక్సీ ఎం సిరీస్లో మార్కెట్లో ఎంటరైన తాజా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇది. శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్లస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లేతో వచ్చింది. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ బేస్డ్ వన్ యూఐ 6.1 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. నాలుగేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ఎక్స్యీనోస్ 1380 ప్రాసెసర్ తో పని చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎం35 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరాతో వస్తున్నది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఈ నెల 20 నుంచి ఈకామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్, రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. హై స్పీడ్ కు వీలుగా 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్ సీ బేస్డ్ ట్యాప్ అండ్ పే ఫంక్షనాలిటీ కనెక్టివిటీ ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.