Samsung Galaxy M34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి తన గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఎక్స్‌నోస్ 1280 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్న స్మార్ట్ ఫోన్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 6.6 అంగుళాల (1080×2408 పిక్సెల్స్ రిజొల్యూషన్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 50-మెగా పిక్సెల్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ గల ఈ ఫోన్ సింగిల్ చార్జింగ్ విత్ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ5 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.16,999, టాప్ స్పెషిఫికేషన్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.18,999 లకు లభిస్తుంది. వివిధ బ్యాంకుల డెబిట్ లేదా డెబిట్ కార్డులపై ఆఫర్లు కూడా లభిస్తాయి. ఈ ప్రారంభ ఆఫర్లు ఎంత కాలం అన్నది శాంసంగ్ వెల్లడించలేదు. ఈ నెల 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా అమెజాన్ వెబ్‌సైట్‌తోపాటు శాంసంగ్ వెబ్ సైట్ లో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్ ఫాల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ గొరిల్లా గ్లాస్-5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 8-మెగా పిక్సెల్ ఆల్డ్రా వైడ్ యాంగిల్ కెమెరా విత్ 120-డిగ్రీస్ ఫీల్డ్, 2-మెగా పిక్సెల్స్ మాక్రో లెన్స్ కెమెరా లభిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ లో 13-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటది. ఈ కెమెరాలో నైటో గ్రఫీ, మాన్ స్టర్ షాట్ 2.0, ఫన్ మోడ్ ఆప్షన్లు ఉంటాయి. ఈ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డోల్బీ అట్మోస్ టెక్నాలజీ గల స్పీకర్లు ఉంటాయి.