Samsung Galaxy F54 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి మరో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఎఫ్ సిరీస్ లో ఎఫ్54 5జీ (Samsung Galaxy F54 5G) ఫోన్ ఆవిష్కరించింది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బిగ్ బ్యాటరీ విత్ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో వస్తున్నదీ ఫోన్. ఈ ఫోన్ ధర రూ.27,999గా నిర్ణయించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ (Samsung Galaxy F54 5G) ఫోన్ సింగిల్ వేరియంట్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. బ్లూ, సిల్వర్ రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్.. శాంసంగ్ వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ లోనూ ప్రీ-బుకింగ్స్ మంగళవారం నుంచే అనుమతించింది. ఈ నెల 12 నుంచి కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ (Samsung Galaxy F54 5G) ఫోన్.. 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఆప్షన్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్.. ఆండ్రాయిడ్ 13 విత్ వన్యూ 5.1 ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుంది. ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ కల ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్-ఓఐఎస్), 8మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా , అథంటికేషన్ కోసం సౌండ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.