Samsung Galaxy A54 & A34 5G | ఇప్పటికే దేశీయ మార్కెట్లో గెలాక్సీ ఏ14 ఫోన్‌ను ఆవిష్కరించిన శాంసంగ్.. తాజాగా గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చేందుకు మూహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు దేశీయ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. రెండు ఫోన్లు కూడా ఐపీ67 రేటింగ్‌తో వస్తున్నాయి.
గెలాక్సీ ఏ54 5జీ ఫోన్ 6.4-అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే విత్ 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నది. ఇక గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ ఎంటీ 877వీ/టఈటీజడ్ఏ చిప్సెట్తో వస్తుందని భావిస్తున్నారు. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్సెట్తోనూ వస్తుందని అంచనా వేస్తున్నారు. గత నెలలో ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో మాదిరిగా అలైన్డ్ కెమెరా మాడ్యూల్స్‌తో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ ఫోన్లు సిల్వర్ వైట్, గ్రాఫైట్, లైమ్, వయోలెట్ కలర్స్‌లో లభిస్తాయని అంచనా వేస్తున్నారు. గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ రూ.36,600 (419 యూరోలు), గెలాక్సీ ఏ54 5జీ ఫోన్ రూ.45,400 (519 యూరోలు)లకు లభిస్తాయని తెలుస్తున్నది. అయితే యూరప్ మార్కెట్ ధరలతో పోలిస్తే భారత్ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే లభించొచ్చు. రెండు ఫోన్లలోనూ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.