No Entry Level Cars? | ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ తగ్గుతోందా.. తయారీ సంస్థలు ఉత్పత్తి ఆపేస్తున్నాయా?
No Entry Level Cars | న్యూ కార్ల కంటే యూజ్డ్ ప్రీమియం కార్లపై కస్టమర్ల మోజెక్కువవుతోంది. 2016-20 మధ్య రూ.5 లక్షల్లోపు కార్ల సేల్స్ మూడో వంతు ...

No Entry Level Cars | ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ తగ్గిపోతున్నదా.. లో కాస్ట్ మినీ కార్ల ఉత్పత్తిని భారత కార్ల తయారీ సంస్థలు నిలిపివేయనున్నాయా.. అవుననే అంటున్నారు. వినియోగదారులు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి బదులు యూజ్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ల వైపు మొగ్గుతున్నారు. ఒకప్పుడు టాటా నానో, హ్యుండాయ్ యోన్ మోడల్ కార్లు ఒకప్పుడు పాపులర్. వాటిని పోలి ఉన్న డస్టన్ గో, గో ప్లస్ మోడల్ కార్ల తయారీని నిలిపివేయనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా తెలిపింది. ఎంట్రీ లెవెల్ కార్లకు బదులు అదే ధరకు మార్కెట్లో లభించే యూజ్డ్ కార్లవైపే కస్టమర్లు మొగ్గుతున్నారు.
ఇక టాటా నానో కార్ల ఉత్పత్తి ఇప్పటికే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మార్కెట్ లీడర్స్‌గా ఉన్న మారుతి సుజుకి ఆల్టో, రెనాల్డ్ క్విడ్, నిస్సాన్ రెడీ-గో వంటి మోడల్స్ కార్ల ఉత్పత్తికి బదులు రూ.5-10 లక్షల్లోపు విలువ గల కార్లపైనే ఫోకస్ చేశాయి.
ఎంట్రీ లెవెల్ కార్ల సేల్స్ ఇలా డౌన్
2016లో రూ.5 లక్షల్లోపు విలువ గల సబ్ క్యాటగిరీ కార్లు 10 లక్షలు అమ్ముడైతే.. 2020 నాటికి 4.16 లక్షలకు పడిపోయాయి. 2016లో మొత్తం కార్ల మార్కెట్లో మూడోవంతు రూ.5 లక్షల్లోపు కార్ల సేల్స్ ఉంటే.. 2020కల్లా 17 శాతానికి పతనమైంది. దీనికి కారణం సొమ్ము ఆదా చేయడానికి కస్టమర్లు యూజ్డ్ కార్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా రూ.5 లక్షల్లోపు విలువ గల కార్లకు డిమాండ్ పడిపోతోంది.
యూజ్డ్ కార్ల సేల్స్‌తో ఇరుపక్షాలకూ లబ్ధి
యూజ్డ్ కార్ల క్రయ విక్రయాలు పెరగడంతో ఇటు కార్ల తయారీ సంస్థలు, అటు కస్టమర్లకు లబ్ది చేకూరుతుందని ఆటోమోటివ్ కన్సల్టెన్సీ సంస్థ జాటో డైనమిక్స్ ఇండియా రవి భాటియా చెప్పారు. మూడేండ్లు.. అంత కంటే లోపు కొనుగోలు చేసిన కొత్త కార్లు.. ఇప్పుడు మార్కెట్లో రూ.5 లక్షల్లోపు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయన్నారు.
రూ.5 లక్షల్లోపు యూజ్డ్ కార్ల సేల్స్ ఇలా..
ఫస్ట్‌టైం కార్ల కొనుగోలు దారులు యూజ్డ్ కార్ల వైపే మొగ్గుతున్నారు. రూ.5 లక్షల్లోపు విలువ గల సెకండ హ్యాండ్ కార్ల కొనుగోలుదారుల సెగ్మెంట్లో 20 శాతం పురోగతి నమోదైందని మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ ఎండీ అశుతోష్ పాండే చెప్పారు. ఎంట్రీ లెవెల్ న్యూ కార్ల కంటే.. అదే ధరకు.. ఆధునిక టెక్నాలజీతో అందుబాటులో ఉన్న యూజ్డ్ ప్రీమియం కార్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. ఎస్యూవీ, ప్రీమియం కార్ల కొనుగోలు వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. ధరలను పరిగణనలోకి తీసుకుంటే యూజ్డ్ కార్ల మార్కెట్ దూసుకెళ్తుందని అశుతోష్ పాండే అభిప్రాయ పడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
రిలయన్స్‌కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!
Amazon own TV | అమెజాన్ సంచలనం.. వచ్చే నెలలో సొంతంగా టీవీ!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

