Amazon own TV | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సొంతంగా మార్కెట్లోకి టెలివిజన్‌ను తీసుకురాబోతున్నది. వచ్చే నెలలో దాన్ని మార్కెట్లో అమెజాన్ ఆవిష్కరిస్తుందని సమాచారం. 55 నుంచి 75 అంగుళాల నిడివితో ఈ టెలివిజన్‌ను డిజైన్ చేశారు. టీసీఎల్ ఆధ్వర్యంలో ఈ టీవీ తయారవుతోంది.
రెండేండ్లుగా దీన్ని ఆవిష్కరించడానికి అమెజాన్ కృషి చేస్తోంది. తొలుత అమెరికా మార్కెట్లో ఆవిష్కరిస్తుంది. అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్‌వేర్‌తో రూపుదిద్దుకుంటున్నది. దీని విక్రయం కోసం బెస్ట్ బైతో పార్టనర్షిప్ చేసుకుంది. కొత్తగా అడాప్టివ్ వాల్యూమ్ ఫీచర్‌ను అమెజాన్ జత చేయనున్నది.