హైదరాబాద్, డిసెంబర్ 13: సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 10 రెట్లు అధిక బిడ్డింగ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. 3,88,29,848 షేర్లకుగాను 39,85,59, 690 షేర్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. వీటిలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల కోసం జారీ చేసిన షేర్లకు 31 రెట్లు అధికంగా బిడ్డింగ్లు రాగా, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల 4.92 రెట్లు, రిటైల్ ఇండివిజల్ ఇన్వెస్టర్లు 1.37 రెట్లు అధిక బిడ్డింగ్లు వచ్చాయి.
షేరు ధరల శ్రేణి రూ.522-549గా నిర్ణయించింది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేరుహోల్డర్లు, ఇతర షేరు హోల్డర్లకు చెందిన 3.82 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా రూ.2,092 కోట్లు నిధులను సమీకరించనున్న సంస్థ..తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయడంతో మరో రూ.950 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.