హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని పర్యాటక ప్రియులకు రెండున్నర దశాబ్దాలుగా అతి తక్కువ ధరలకే అత్యుత్తమ సదుపాయాలతో దేశ, విదేశీ యాత్రల సౌకర్యాన్ని అందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లిమిటెడ్.. బుధవారం మరో 6 నగరాల్లో నూతన శాఖలను అందుబాటులోకి తెచ్చింది. వరంగల్, ఖమ్మం, కర్నూలు, భీమవరం, రాజమండ్రి, ఒంగోలులో కొత్త కార్యాలయాలను ప్రారంభించింది.
25 ఏండ్ల క్రితం హైదరాబాద్‌లో మొదలైన ఆర్వీ టూర్స్ ప్రస్థానం.. ఆ తర్వాతి రోజుల్లో బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్‌లకు విస్తరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని నగరాలకు తమ సేవలను తీసుకొచ్చామని, ఈ సదుపాయాన్ని ఆయా నగరాలు, పట్టణాల ప్రజలు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో సంస్థ చైర్మన్ ఆర్వీ రమణ్ కోరారు.
ఇన్నేండ్లుగా తమకు సహకరిస్తూ, తమ ఉన్నతికి దోహదపడిన ప్రతీ కస్టమర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కొత్త శాఖల ప్రారంభోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను సంస్థ ప్రకటించింది. ఇందులోభాగంగానే కేవలం రూ.21,999కే కాశీ, అయోధ్య 4 రోజుల విమాన ప్యాకేజీని అందిస్తున్నట్టు రమణ్ చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.