తాలిన్ (ఇస్తోనియా), ఆగస్టు 15: రష్యా కరెన్సీ రూబుల్ పతనాన్ని అడ్డుకునేక్రమంలో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ మంగళవారం భారీగా వడ్డీ రేట్లను పెంచింది. ప్రపంచంలో తాజాగా అత్యంత కనిష్ఠస్థాయికి పతనమైన కరెన్సీలు భారత్ రూపాయి, రష్యా రూబులే. డాలరు మారకంలో రూబుల్ విలువ 101 స్థాయికి పడిపోయింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తొలినాళ్ల తర్వాత ఇంతటి కనిష్ఠస్థాయికి పతనం కావడం ఇదే ప్రధమం. దీంతో రంగంలోకి దిగిన రష్యా కేంద్ర బ్యాంక్ కీలక వడ్డీ రేటును ఒక్కసారిగా 3.5 శాతం పెంచి 12 శాతానికి చేర్చింది. రేట్ల పెంపు ప్రకటన తర్వాత రూబుల్ 98 స్థాయికి బలపడింది.