ముంబై, మే 8 : దేశీయ కరెన్సీకు మరిన్ని చిల్లులు పడ్డాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో దేశీయ కరెన్సీ భీకర నష్టాల్లోకి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81 పైసలు నష్టపోయి 85.58 వద్ద ముగిసింది. గడిచిన రెండేండ్లలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి.
ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటం ఫారెక్స్ మార్కెట్లో అలజడి సృష్టించిందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. 84.61 వద్ద ప్రారంభమైన డాలర్-రుఫీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 84.52 నుంచి 85.77 శ్రేణిల్లో కదలాడింది. చివరకు ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 81 పైసలు కోల్పోయి 85.58 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 22, 2022న పడిపోయిన 83 పైసల తర్వాత ఇదే రెండో అతిపెద్ద పతనం.