Dollar Vs Rupee | ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడంతో డాలర్‌పై రూపాయి మారకం విలువ గురువారం 102 పైసలు నష్టపోయింది. విదేశీ పెట్టుబడిదారులు దేశీయ స్టాక్ మార్కెట్లలో స్టాక్స్ అమ్మకాలకు దిగారు. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌పై 105 డాలర్లకు చేరుకున్నది. దీంతో క్రూడాయిల్‌పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో గురువారం అమెరికా డాలర్‌పై రూపాయి 75.02 వద్ద మొదలై తర్వాత రూ.75.75 వరకు పడిపోయింది. తిరిగి రూ.75.63 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే డాలర్‌పై రూపాయి మారకం విలువ 102 పైసలు నష్టపోయింది.