ముంబై, మే 13: ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ముందు రూపాయి వెలవెలబోతున్నది. శుక్రవారం ట్రేడింగ్‌లో మూడు వారాల కనిష్ఠాన్ని తాకుతూ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 9 పైసలు పడిపోయి 82.18 స్థాయికి దిగజారింది. అంతకుముందు రోజైతే 15 పైసలు క్షీణించింది.
ఈ క్రమంలోనే ఈ వారం మొత్తంగా చూసినైట్టెతే రుపీ విలువ.. 8 వారాల కనిష్ఠానికి పతనమైంది. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులే రుపాయి విలువను కోలుకోనివ్వడం లేదని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. అలాగే దిగుమతిదారుల నుంచి కనిపిస్తున్న డిమాండ్ కూడా డాలర్‌ను బలపరుస్తున్నదని చెప్తున్నారు.