Rupee @ Dollar | రూపాయి విలువ మరింత చిక్కిపోయింది. సోమవారం ట్రేడింగ్‌లో ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి విలువ 77.58 రూపాయలకు పడిపోయింది. మున్ముందు 79 రూపాయలకు కూడా పడిపోవచ్చునని అంచనాలు ఉన్నాయి. ఇంతకుముందు మార్చి ఏడో తేదీన రూపాయి విలువ 76.98 వద్ద ఆల్‌టైం కనిష్ట స్థాయి నమోదు చేసింది. గతవారం కీలక వడ్డీరేట్లు అమెరికా ఫెడ్ రిజర్వు 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో డాలర్ బలోపేతం అయ్యింది. అమెరికా పదేండ్ల గడువు గల బాండ్లు సైతం 14 బేసిక్ పాయింట్లు పెరిగాయి. ఇంతకుముందు అమెరికా బాండ్లు 3.17 శాతం పెరిగాయి.
ఆరు ప్రధాన కరెన్సీలతో సరిపోల్చగా అమెరికా డాలర్ విలువ 104 స్థాయికి పెరిగిపోయింది. 20 ఏండ్ల క్రితం 104.07 వద్ద అమెరికా డాలర్ నిలిచింది. 2022లో డాలర్ విలువ 8 శాతం పెరిగింది. ఇంతకుముందు సెషన్లో డాలర్ విలువ 103.79 వద్ద నిలిచింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు భారత్‌లో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లలో షేర్లు విక్రయించేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.3 లక్షల కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడం కూడా రూపాయి విలువ పడిపోవడానికి మరో కారణం.