ముంబై, జనవరి 1: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరో 10 పైసలు పడిపోయి 89.98కి చేరింది. దీంతో ఈ ఏడాదికి దేశీయ కరెన్సీ నష్టాలతో స్వాగతం పలికినైట్టెంది. స్టాక్ మార్కెట్ల పేలవ ప్రదర్శన, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు ఫారెక్స్ మార్కెట్లో రూపీని ఒత్తిడికి లోను చేసినట్టు ట్రేడర్లు చెప్తున్నారు.
గత ఏడాది రూపాయి విలువ 5 శాతం దిగజారిన విషయం తెలిసిందే. రూపీ బలోపేతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం మాత్రం నిరాశాజనకంగానే ఉంటున్నది. రూపాయి విలువ పడిపోతున్నకొద్దీ దేశంలోకి వచ్చే దిగుమతులు భారమైపోతాయి.