రూపాయి @ 94.88
దేశీయ కరెన్సీ విలువ మరింత కరిగిపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే కరెన్సీ విలువ 20 పైసలు కోల్పోయి ఆల్టైంకు కనిష్ఠ స్థాయి 94.88కి పడిపోయింది.
- చారిత్రక కనిష్ఠస్థాయికి పడిపోయిన విలువ
ముంబై, ఏప్రిల్ 29: దేశీయ కరెన్సీ విలువ మరింత కరిగిపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే కరెన్సీ విలువ 20 పైసలు కోల్పోయి ఆల్టైంకు కనిష్ఠ స్థాయి 94.88కి పడిపోయింది. ఇంధన ధరలు భగ్గుమనడంతో రూపాయితోపాటు ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. దీనికి తోడు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం కూడా రూపాయి పతనానికి ఆజ్యంపోశాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 115 డాలర్ల పైకి చేరుకోవడంతో దేశీయ దిగుమతుల భారం మరింత పెరగనున్నదని, అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఆందోళనను మరింత పెంచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అంతా ఆశాజనకంగా లేకపోవడంతో అమెరికా ఫెడరల్ రిజర్వు ఈసారి ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలుండటం కూడా పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని పేర్కొన్నారు. 94.79 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు చివరకు 20 పైసల నష్టంతో 94.88 వద్దకు పడిపోయింది. మంగళవారం కూడా రూపాయి విలువ 53 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

