ముంబై, ఏప్రిల్ 24: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నది. శుక్రవారం ట్రేడింగ్‌లో మరో 15 పైసలు నష్టపోయిన దేశీయ కరెన్సీ.. ఈ వారంలో జరిగిన 5 సెషన్లలో మొత్తంగా 125 పైసలు పతనమైంది. దీంతో మళ్లీ 94 మార్కు ఎగువకు దిగజారి 94.16 వద్ద ఆగింది. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తిరిగి విజృంభిస్తున్నాయి. ఫలితంగా దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతున్నది. అందుకే రూపాయికి నష్టాలు తప్పట్లేదని ఫారెక్స్ ట్రేడర్లు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల ఉత్సాహంతో గత వారం అందుకున్న వరుస లాభాలతో రూపీ వాల్యూ 92.91 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.