ముంబై, మార్చి 25: రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే మరో 20 పైసలు కోల్పోయి 93.96 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం వల్లనే రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లపై సానుకూల ధోరణి రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయలేకపోయాయన్నారు. 93.94 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఒక దశలో 94.13 స్థాయికి పడిపోయింది.