శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 17: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆధునిక నావిగేషన్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎమ్మార్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. నూతన రన్వే అందుబాటులోకి రావడంతో విమానాల రాకపోకలు మెరుగుపడటంతోపాటు భద్రతా ప్రమాణాలు మరిం త మెరుగుపడనున్నాయని వివరించారు. అధునాతన వ్యవస్థ 300 మీటర్ల(ఆర్వీఆర్) దృశ్యమానం ఉన్న ప్రతికూల వాతావరణంలో విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యే వీలు పడనున్నది.