భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కియారా అద్వానీ ప్రస్తుతం హిందీలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఆమె నటించిన చిత్రాలన్ని వరుస విజయాలు సాధించడంతో కియారాకు స్టార్డం వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న కియారా తరచు హెడ్ లైన్స్‌లో నిలుస్తుంది. ఆ మధ్య సిద్ధార్థ్‌తో ప్రేమాయణం, అనంతరం బికినీలో ఫొటో షూట్స్,అప్పుడప్పుడు గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ అందరి దృష్టి తనవైపు పడేలా చేస్తుంది.
కియారా తాజాగా నెటిజన్స్ విమర్శలకు గురవుతుంది. రీసెంట్గా సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి కియారా రాగా, ఆమె కారు డోరుని ఓ వృద్ధుడు తెరచాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆమెపై విరుచుకు పడ్డారు. సెలబ్రిటీలు తాము చాలా గొప్పగా ఫీలవుతుంటారా, ఓ వృద్ధుడితో డోర్ తీయించుకోకపోతే మీరు డోర్ కూడా తీసుకోలేనంత పెద్దోళ్లయ్యారా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. దీనిపై కియారా ఏమైన స్పందింస్తుందా చూడాలి.