హైదరాబాద్, ఫిబ్రవరి 22: ప్రముఖ ఫర్నిచర్ విక్రయ సంస్థ రాయల్ఓక్..తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా కొత్తగూడెంలోకి ప్రవేశించింది. 16 వేల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో లివింగ్ రూమ్‌లు, బెడ్రూం, డ్రైనింగ్ రూంకు సంబంధించిన అన్ని రకాల ఫర్నిచర్లు లభించనున్నాయని రాయల్ఓక్ చైర్మన్ విజయ్ సుబ్రమణ్యం తెలిపారు.
కస్టమర్లకు సరసమైన ధరల్లో అత్యుత్తమ ఫర్నిచర్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణలో సంస్థకు ఇది 25వ స్టోర్ కాగా, దేశవ్యాప్తంగా 166 స్టోర్.