రిస్క్‌కు దూరంగా ఉండాలనుకుంటూ.. క్యాపిటల్ భద్రతతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా కాస్త అధికంగా రాబడిని ఆశించే మదుపరులకు డెట్ మ్యూచువల్ ఫండ్లు అనువైనవి. క్రమం తప్పకుండా ఆదాయాన్ని ఇవ్వడమేగాక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతో పోల్చితే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. క్రెడిట్ రేటింగ్, వడ్డీరేట్ల రిస్క్‌లు ఉన్నా వాటి ప్రభావం డెట్ మ్యూచువల్ ఫండ్లపై తక్కువే. అందుకే బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిపోవడంతో చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ప్రారంభించారు. ఈ పెట్టుబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఉత్తమ రాబడులను అందిస్తున్నాయిప్పుడు. మ్యూచువల్ ఫండ్లు వివిధ పరిశ్రమలు, కంపెనీల్లో మదుపు చేయడం ద్వారా వివిధీకరణతో రిస్క్‌ను తగ్గిస్తాయి. కాగా, కేవలం గత రాబడుల ఆధారంగానే మ్యూచువల్ ఫండ్లను ఎంపిక చేయరాదు. అలాగే మనం తీసుకునే రిస్క్‌ను బట్టే రాబడులు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి రిస్క్ తీసుకోవడం ఎంత వరకు సమంజసమో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా డెట్ మ్యూచువల్ ఫండ్లు ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులకు ఉత్తమమని చెప్పవచ్చు.