హైదరాబాద్, అక్టోబర్ 23: రైడ్ సేవల సంస్థ ర్యాపిడో..ఇండోఫాస్ట్తో జట్టుకట్టింది. ఈవీలతో రవాణా సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో పియాజియోకు చెందిన 10 వేల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, ఈ-సిటీ మ్యాక్స్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. తొలి దశలో వెయ్యి ఈవీలతో హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో రవాణా సదుపాయాలను సమకూరుస్తున్నట్లు తెలిపింది. దశలవారీగా వచ్చే రెండేండ్లలో ఈవీల సంఖ్యను 10 వేలకు పెంచుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇండోఫాస్ట్ ఎనర్జీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈవీలతో తమ కస్టమర్లకు రవాణా సదుపాయాలు సమకూర్చవచ్చునని ర్యాపిడో కో-ఫౌండర్ పవన్ గుంటుపల్లి తెలిపారు.