న్యూఢిల్లీ, జూన్ 3: రెస్టారెంట్లు సర్వీస్ చార్జ్‌ను కస్టమర్లకు ఇచ్చే బిల్లుల్లో కలపకూడదని కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖా మంత్రి పీయుష్ గోయల్ శుక్రవారంనాడిక్కడ స్పష్టంచేశారు. ‘టిప్స్’ వేరుగా ఇవ్వడం కస్టమర్ల ఇష్టమని చెప్పారు. రెస్టారెంట్ యజమానులు వారి ఉద్యోగులకు అధిక వేతనాల్ని చెల్లించాలనుకుంటే ఫుడ్ మెనూలో ధరల్ని పెంచుకునే స్వేచ్ఛ వారికి ఉందని, దేశంలో వీటి పెంపునకు ఎటువంటి నియంత్రణలు లేవన్నారు.
సర్వీస్ చార్జ్ ఎత్తివేస్తే తాము నష్టపోతామన్న రెస్టారెంట్ యజమానుల వాదనను మంత్రి కొట్టివేశారు.కస్టమర్ల నుంచి సర్వీస్ చార్జ్ వసూలు చేయడం అనైతికమని, ఈ చార్జ్ విధింపును నిలిపివేసేందుకు చట్ట నిబంధనలు ప్రవేశపెట్టనున్నట్టు గురువారం వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్లు సర్వీస్ చార్జ్ వసూలు చేస్తున్న అంశమై ప్రభుత్వానికి వినియోగదారుల నుంచి పలు ఫిర్యాదులు అందుతున్నాయని గోయల్ తెలిపారు.
can not force on