ముంబై, డిసెంబర్ 23: విదేశీ మారకం నిల్వలు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 15తో ముగిసిన వారంతానికిగాను 9.112 బిలియన్ డాలర్లు పెరిగి 615.971 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ వెల్లడించింది.
అంతక్రితంవారంలోనూ రిజర్వులు 2.816 బిలియన్ డాలర్లు ఎగబాకి 606.859 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 8.349 బిలియన్ డాలర్లు పెరిగి 545.048 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గోల్డ్ రిజర్వులు 446 మిలియన్ డాలర్లు అధికమై 47.577 బిలియన్ డాలర్లకు చేరాయి.