Samsung India Layoffs : శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ భారత్ ఆపరేషన్స్‌కు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. వ్యాపార వృద్ధి మందగించడం, వ్యయ నియంత్రణ, డిమాండ్ లేమి వంటి కారణాలతో ఉద్యోగులను కుదించాలని కంపెనీ నిర్ణయించిందని సమాచారం. మొబైల్ ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, సపోర్ట్ ఆపరేషన్స్ వంటి పలు విభాగాల్లో లేఆఫ్స్ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
భారత్‌లో శాంసంగ్ ఎగ్జిక్యూటివ్‌లు దాదాపు 2000 మంది ఉండగా వీరిలో 9 నుంచి 10 శాతం ఉద్యోగులపై తాజా లేఆఫ్స్ ప్రభావం ఉంటుంది. కంపెనీ చెన్నై ఫ్యాక్టరీలో కార్మికులు సమ్మెలో ఉన్న సమయంలో లేఆఫ్స్ వార్తలు ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. సమ్ము కారణంగా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. సమ్మె మూడో రోజుకు చేరుకోగా ఫ్యాక్టరీ సామర్ధ్యంలో 50 శాతం నుంచి 80 శాతం వరకే ఉత్పత్తి జరుగుతోంది.
పండగ సీజన్లో అటు లేఆఫ్స్, ఇటు కార్మికుల సమ్మె కంపెనీపై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు లేఆఫ్స్‌తో పాటు భారత్‌లో తమ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణపైనా శాంసంగ్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా టీవీ, హోం అప్లయన్సెస్ వంటి పలు వ్యాపార విభాగాల విలీనంతో మరికొన్ని ఉద్యోగాలను కుదించే అవకాశం ఉంది. ఇక దివాళీ సీజన్ అనంతరం దీనిపై తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.
Read More :
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !