న్యూఢిల్లీ : ఆల్కహాలిక్ రెడీ-టూ-డ్రింక్ లెమన్-డౌతో (Lemon-Dou) దేశీ ఆల్కహాలిక్ పానీయాల విభాగంలోకి అడుగుపెట్టాలని కోకకోలా ఇండియా కసరత్తు సాగిస్తోంది. గోవా, మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో లెమన్-డౌను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోందని సమాచారం. భారత్ మార్కెట్లో ఆల్కహాలిక్ పానీయాల మార్కెట్లో లెమన్-డౌ కోకకోలా ఇండియా తొలి ఉత్పత్తి కావడం విశేషం.
జపాన్‌లో చుహై కాక్‌టైల్‌గా పేరొందిన లెమన్=డౌ బ్రాండీ, వోడ్కాతో పోలిన డిస్టిల్డ్ లిక్కర్ కాగా దీన్ని లైమ్ జెస్టీ ఫ్లేవర్‌తో మిశ్రమం ద్వారా లెమన్-డౌను తయారుచేస్తారు. ప్రయోగాత్మక దశలో లెమన్-డౌ 250ఎంఎల్ ధరను రూ. 230గా నిర్ధారించేందుకు కోకకోలా ప్రణాళికలు రూపొందిస్తోంది. నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ విభాగంలో కాకుండా లెమన్-డౌను ఇతర ప్లాంట్స్‌లో తయారుచేస్తామని కోకకోలా ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారని సమాచారం.
కోకకోలా భారత్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించిన మూడు దశాబ్ధాల అనంతరం దేశీ ఆల్కహాలిక్ పానీయాల మార్కెట్లోకి అడుగుపెడుతుండటం గమనార్హం. సాఫ్ట్ డ్రింక్స్‌తో పాటు అన్ని రకాల పానీయాలు అందించే బ్రాండ్‌గా ఎదిగే క్రమంలో కోకకోలా భారత్‌లో ఆల్కహాలిక్ పానీయాల మార్కెట్లోనూ కాలుమోపింది. ఆల్కహాల్ పెద్ద విభాగామని ఈ రంగంలో ప్రయోగం చేయాలని తాము నిర్ణయించుకున్నామని కోకకోలా గ్లోబల్ మార్కెటింగ్ చీఫ్ మనోలొ అరయో స్పష్టం చేశారు.
Read More :