CM Hemant Soren | జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఆరోసారి ఈడీ నోటీసులు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది.
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు తెలిపారు.
కాగా, ఈ కేసుకు సంబంధించింది గతంలో పంపిన సమన్లపై సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని విచారణ సంస్థ అరెస్టు చేసింది. వారిలో 2011 బ్యాచుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఛవీ రంజన్ కూడా ఉన్నారు. ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషన్‌గా పనిచేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సోరెన్‌ను గతేడాది నవంబర్‌లో ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

