న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్‌కు స్వల్ప ఊరట లభించింది. హైదరాబాద్‌లో సంస్థకున్న ఆర్అండ్డీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అమెరికా నియంత్రణ మండలి..ఈ సెంటర్లో లోపాలు ఉన్నాయి కానీ చర్యలు తీసుకోబోమని స్పష్టంచేసింది.
ఈ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్(వీఏఐ)ను జారీ చేసింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ఉన్న ఆర్అండ్డీ సెంటర్‌ను గతేడాది డిసెంబర్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ షేరు ధర 2.56 శాతం బలపడి రూ.6,310 వద్ద ముగిసింది.