Reliance | గతవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.62,279.74 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీన్ రూ.38,495.79 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టంతో రూ.16,32,577.99 కోట్లకు చేరుకున్నది. అయినా ఎం-క్యాప్‌లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారత్ ఎయిర్టెల్ భారీగా నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా లబ్ధి పొందాయి. గత నెల రెండో వారంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీగా రూ.25,011 కోట్ల ఎం-క్యాప్ కోల్పోయింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 500 పాయింట్ల లబ్ధితో ముగిసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,917 కోట్లు పెరిగి రూ.11.93 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,338 కోట్ల లబ్ధితో రూ.5.99 లక్షల కోట్ల వద్ద నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.6,562 కోట్ల పురోగతితో రూ.4.43 లక్షల కోట్లకు చేరుకున్నది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,495 కోట్ల నష్టంతో రూ.16.33 లక్షలకోట్లకు పతనమైంది. హిందూస్థాన్ యూనీ లివర్ రూ.14,649 కోట్ల పతనంతో రూ.5.89 లక్షల కోట్లకు.. భారతీ ఎయిర్టెల్ రూ.4,194 కోట్లు కోల్పోయి రూ.4.84 లక్షల కోట్లకు, ఐటీసీ రూ.3,037 కోట్ల నష్టంతో రూ.5.50 లక్షల కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.898 కోట్ల పతనంతో రూ.6.78 లక్షల కోట్లకు టీసీఎస్ రూ.512 కోట్ల నష్టంతో 12.36 లక్షల కోట్లకు చేరుకున్నది.
గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ16.33 లక్షల కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ రూ.12.36 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.93 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.6.78 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ రూ.5.99 లక్షల కోట్లు, హెచ్‌యూఎల్ రూ.5.89 లక్షల కోట్లు, ఐటీసీ రూ.5.50 లక్షల కోట్లు, భారతీ ఎయిర్ టెల్ రూ.4.84 లక్షల కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.4.43 లక్షల కోట్ల వద్ద నిలిచాయి.