Jio | రిలయన్స్ జియో రూ.799 రీఛార్జి ప్లాన్‌ని రద్దు చేసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆ ప్లాన్ కొనసాగుతూనే ఉంటుందని, యూజర్లు ఎప్పటిలాగే రీఛార్జి చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. జియో వెబ్సైట్, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని కంపెనీ వివరించింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా, అందుబాటు ధరలో రీచార్జ్ ప్లాన్స్‌ను అందించేందుకు కట్టుబడి ఉన్నామని జియో పేర్కొంది. రూ.799 ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయని కంపెనీ చెప్పింది. రిలయన్స్ జియో ప్రస్తుతం మార్కెట్ లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడానికి అవసరం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో తక్కువ ధరలో అందించే రూ.249, రూ.799 తొలగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఎయిర్ టెల్ సైతం రూ.249 ప్లాన్‌ను తొలగించింది.