Jio TV Premium Plan | ప్రముఖ టెలికం సంచలనం రిలయన్స్ జియో.. తన అనుబంధ జియో టీవీ సబ్ స్క్రైబర్ల కోసం అద్భుతమైన ‘టీవీ ప్రీమియం’ ప్లాన్లు తెచ్చింది. జియో టీవీ కోసం ప్రీమియం వర్షన్ ప్లాన్ జియో ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. 28 రోజులు, 84 రోజులు, ఏడాది గడువునకు వేర్వేరు ప్లాన్లు ప్రకటించింది. సింగిల్ ప్రీపెయిడ్ ప్లాన్ కింద ఒకేసారి 14 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వాడుకోవచ్చు.
28 రోజుల గడువు గల ప్రీపెయిడ్ ప్లాన్ కోసం రూ.398, 84 రోజుల ప్రీ పెయిడ్ ప్లాన్ కోసం రూ.1198, 365 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ కింద రూ.4,498 పే చేయాలని తెలిపింది. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తోపాటు ప్రతి రోజూ 2 జీబీ డేటా పొందడంతోపాటు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ.398 ప్రీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కింద 12 ఓటీటీ యాప్స్, రూ.1198 సబ్‌స్క్రిప్షన్‌తో 14 ఓటీటీ యాప్స్ పొందొచ్చు. వార్షిక ప్లాన్ పొందగోరే వారు ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లు శనివారం నుంచి కొనుగోలు చేయొచ్చు. జియో మొబైల్ ఫోన్ నంబర్ యూజర్లు జియో టీవీ ప్రీమియం ఓటీటీ కంటెంట్ పొందొచ్చు.
ఒక్కసారి లాగిన్ అయితే జియో సినిమా ప్రీమియంతోపాటు డిస్నీ+ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, ప్రైమ్ వీడియో (మొబైల్), లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ +, డాకుబే, హోయిచోయి, సన్ నెక్ట్స్, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఎపికోన్, కంచా లంకా తదితర ప్లాట్ ఫామ్స్ వాడొచ్చు. మీరు ఎంచుకునే ప్లాన్లను బట్టి డిస్నీ + హాట్ స్టార్, ప్రైమ్ వీడియో (మొబైల్) యాప్స్ కంటెంట్ కూడా వీక్షించొచ్చు.