Reliance | రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఆయిల్ 2 కెమికల్ బిజినెస్ ప్రభావం పడింది. అధిక వడ్డీరేట్లు, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ ఫలితంగా జూన్ త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.16,011 కోట్లు. గతేడాదితో పోలిస్తే 11 శాతం తక్కువ.
గతేడాది జూన్ త్రైమాసికం నికర లాభం రూ.17,955 కోట్లు, షేర్‌పై రూ.26.54గా నిలిచింది. ఈ ఏడాది రూ.16,011 కోట్లు కాగా, షేర్ మీద రూ.23.66లకు పడిపోయిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో పోల్చినా.. నికర లాభం తగ్గింది. గత మార్చి త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.19,299 కోట్లు.
ఇక జూన్ త్రైమాసికంలో ఆపరేషన్ల ద్వారా ఆదాయం 2022-23తో పోలిస్తే రూ.2.22 లక్షల కోట్ల నుంచి రూ.2.1 లక్షల కోట్లకు పడిపోయింది. 2022-23 మార్చి త్రైమాసికంలో ఆపరేషన్ల ద్వారా రిలయన్స్ ఆదాయం రూ.2.16 లక్షల కోట్లు. క్రూడాయిల్ ధర తగ్గడం వల్ల రిలయన్స్ లాభం తగ్గినట్లు తెలుస్తున్నది.