హైదరాబాద్, సెప్టెంబర్ 17: రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఐఫోన్ 16 అన్ని రకాల మాడళ్లు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లతోపాటు ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో కూడా ఈ ఫోన్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఈ ఫోన్లను ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి రిఫండ్ రెండుసార్లు అందిస్తున్నట్లు వెల్లడించింది.
గతేడాది వచ్చిన ముందస్తు బుకింగ్‌లతో పోలిస్తే ఈ సారి ఐఫోన్ 16కి విశేష స్పందన లభించిందని, రెండింతలు బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పలు క్రెడిట్ కార్డులపై రాయితీ కూడా ఇస్తున్నట్లు తెలిపింది.