ముంబై, ఆగస్టు 14: రిలయన్స్ డిజిటల్ మరోసారి ‘డిజిటల్ ఇండియా సేల్’ను ప్రకటించింది. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులు 25 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ ద్వారా కొనుగోలు చేసినవారికి వర్తించనున్నది. ఈ ఆఫర్లు ఈ నెల 18 వరకు అమలులో ఉండనున్నదని పేర్కొంది. దీంట్లోభాగంగా 55 ఇంచుల యూహెచ్డీ టీవీ ప్రారంభ ధర రూ.29,990 కాగా, ఐఫోన్ 13ని కేవలం రూ.47,600కి, ఐఫోన్ 15ని రూ.63,600కి, ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌ను రూ.39,999కే, టాప్లోడ్ వాషింగ్ మెషిన్‌ను రూ.19,990కే అందిస్తున్నది.