న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ముకేశ్ అంబానీకి చెందిన సంస్థల్లో మరోసారి ఫేస్బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఐదేండ్ల క్రితం రిలయన్స్‌లో వేలాది కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంస్థ..మళ్లీ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఏఐ వెంచర్లో 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇరు సంస్థలు కలిసి రూ.855 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు రిలయన్స్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది. ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్‌కు 70 శాతం వాటా ఉండనుండగా, మెటా ప్లాట్‌ఫాం మిగతా 30 శాతం వాటా కలిగివుండనున్నది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన రిలయన్స్ ఇంటిలిజెన్స్, ఫేస్బుక్ సంయుక్తంగా ఈ సంస్థను నెలకొల్పారు. రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ ఇంటిలిజెన్స్ లిమిటెడ్..రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌లు సంయుక్తంగా నెలకొల్పారు. ఏఐ సర్వీసులను అభివృద్ధి చేయడంతోపాటు మార్కెటింగ్, డిస్ట్రిబ్యూట్ చేయనున్నది.