Radhika Merchant-Neeta Ambani | రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ గురువారం రిలయన్స్ 47వ వార్షిక వాటాదారుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు ప్రత్యేక ఆహ్వానం పలికారు.
‘ఈ ఏడాది మన దేవతల ఆశీస్సులతో నా చిన్న కొడుకు అనంత్ అంబానీ తన సోల్ మేట్ రాధికతో కలిసి జీవన ప్రయాణం ప్రారంభించాడు. హృదయపూర్వక ప్రేమాభిమానాలతో మన రిలయన్స్ కుటుంబంలోకి రాధికకు స్వాగతం పలుకుతున్నాం. ఇటీవలే జరిగిన అనంత్-రాధిక వివాహానికి హాజరైన శుభాకాంక్షలు తెలిపి దీవించిన వారందరికీ మేం ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు.
‘అనంత్-రాధిక వైవాహిక జీవితం మరింత అందంగా, పవిత్రంగా సాగేందుకు మీ ఆశీస్సులు దోహదం చేస్తాయి’ అని హిందీలో చెప్పారు. గత నెల 12న ముంబైలో ముకేశ్ అంబానీ- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ.. గుజరాత్ లోని జామ్ నగర్‌ను తమ సేవాభూమిగా మార్చినందుకు తల్లిదండ్రులుగా ముకేశ్ అంబానీ, తాను గర్వ పడుతున్నామని నీతా అంబానీ చెప్పారు.
వన్య ప్రాణుల కోసం జామ్ నగర్ లో అనంత్ అంబానీ ‘వనతార’ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ నానమ్మ కోకిలాబెన్ జన్మభూమి జామ్ నగర్. తాత ధీరూభాయి అంబానీ కర్మభూమి అని, దాన్ని అనంత్ సేవా భూమిగా మార్చడం తల్లిదండ్రులుగా తమకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. జామ్ నగర్ లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ పరిధిలో సుమారు 3000 ఎకరాల భూమిలో వనతార అనే సంస్థను ఏర్పాటు చేసిన అనంత్ అంబానీ.. వన్య ప్రాణుల సంరక్షణ, పునరాసానికి వసతులు కల్పించారు.
Apple – Jobs | ఉద్యోగార్థులకు ఆపిల్ ఆఫర్.. ఏడు నెలల్లో ఆరు లక్షల కొలువులు