Reliance AGM | బీమా’ లోకి జియో ఫైనాన్సియల్.. ఆ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్..]
Reliance AGM | రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) తన సేవలను విస్తరించ తలపెట్టింది. బీమా రంగంలో అడుగిడనున్న జేఎఫ్ఎస్.. మ్యూచువల్ ఫండ్స్ రంగంలో బ్లాక్రాక్తో కలిసి జాయింట్ వెంచర్ నిర్వహించనున్నది.
Reliance AGM | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ‘జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services)’ బీమా రంగంలోకి అడుగు పెట్టనున్నది. ఈ సంగతి రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సోమవారం జరిగిన సంస్థ 46వ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో ప్రకటించారు.
సాధారణ, జీవిత, ఆరోగ్య బీమా రంగ ఉత్పత్తుల్లోకి జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్సీ) ఎంటరవుతుందని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇందుకోసం గ్లోబల్ ఇన్సూరెన్స్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుందన్నారు.
‘ప్రారంభంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేయాడానికి జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్)లో రిలయన్స్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది పూర్తిగా అత్యధిక పెట్టుబడుల ఇన్సెంటివ్ బిజినెస్.’ అని ముకేశ్ అంబానీ తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ- అమెరికా కేంద్రంగా పని చేస్తున్న బ్లాక్ రాక్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. 11 లక్షల కోట్ల డాలర్ల పై చిలుకు ఆస్తులతో పేరు ప్రఖ్యాతుల గల సంస్థ బ్లాక్ రాక్ అని తెలిపారు. బ్లాక్ రాక్, జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టర్లకు చౌక, ఇన్నోవేటివ్ ఇన్వెస్ట్ మెంట్ సొల్యూషన్స్ అందిస్తుందన్నారు. బ్లాక్ రాక్ సీఈఓ ల్యారీ ఫింక్ కూడా సమావేశంలో మాట్లాడారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

