బీపీసీఎల్‌కు రిఫైనరీ దన్ను
దేశీయ ఇంధన విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) అంచనాలకుమించి రాణించింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికరావడం, ఇంధన విక్రయాలు భారీగా పెరగడంతో గత త్రైమాసికానికిగాను రూ.3,181.42 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, జనవరి 29: దేశీయ ఇంధన విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) అంచనాలకుమించి రాణించింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికరావడం, ఇంధన విక్రయాలు భారీగా పెరగడంతో గత త్రైమాసికానికిగాను రూ.3,181.42 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,747.01 కోట్లతో పోలిస్తే 82 శాతం అధికమని పేర్కొంది. అయినప్పటికీ, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.8,243.55 కోట్ల కంటే ఇది తక్కువ కావడం విశేషం. గత త్రైమాసికంలో సంస్థకు బ్యారెల్ క్రూడాయిల్‌ను శుద్ది చేయడంతో 13.3 డాలర్ల ఆదాయం సమకూరింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1.3 లక్షల కోట్లుగా నమోదైంది.
- చమురు విక్రయాలు 12.92 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి.
- డిసెంబర్ త్రైమాసికంలో బ్యారెల్ క్రూడాయిల్‌ను శుద్ది చేయడంతో సంస్థ 14.72 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇది 20 డాలర్లుగా ఉన్నది.
- గత త్రైమాసికంలో కొత్తగా 501 పెట్రోల్ బంక్‌లను ప్రారంభించింది. దీంతో మొత్తం సంఖ్య 21,532కి చేరుకున్నాయి. అలాగే 112 సీఎన్జీ స్టేషన్లను కూడా ప్రారంభించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

