ముంబై, నవంబర్ 29: విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో కరిగిపోయిన నిల్వలు ఈ నెల 22తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 656.582 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 17.761 బిలియన్ డాలర్లు తగ్గిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తరిగిపోవడం వల్లనే రిజర్వులు తగ్గుతున్నాయని తెలిపింది. వీటి విలువ 3.043 బిలియన్ డాలర్లు తరిగిపోయి 566.791 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే గోల్డ్ రిజర్వులు మాత్రం 1.828 బిలియన్ డాలర్లు పెరిగి 67.573 బిలియన్ డాలర్లకు చేరాయి.