Redmi 12 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్మీ తన రెడ్మీ12 సిరీస్ ఫోన్లను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెడ్మీ12 సిరీస్ 4జీ అండ్ 5జీ వేరియంట్లను ఆవిష్కరించింది. రెడ్మీ12 4జీ ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ వేరియంట్ మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్సెట్, రెడ్మీ12 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్‌తో వస్తున్నది. రెండు స్మార్ట్ ఫోన్లు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ బేస్డ్ ఎంఐయూఐ 14 ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తాయి.
రెడ్మీ12 4జీ ఫోన్ బేస్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు లభిస్తాయి. బ్యాంక్ ఆఫర్ లేదా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.1000 అందిస్తుంది. జేడ్ బ్లాక్, మూన్ స్టోన్ సిల్వర్, పాస్టిల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రెడ్మీ12 5జీ బేస్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.12,499, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. బ్యాంక్ లేదా లాయాల్టీ డిస్కౌంట్లు పొందొచ్చు.
రెడ్మీ12 సిరీస్ ఫోన్ల విక్రయాలు ఈ నెల నాలుగో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. రెడ్మీ వెబ్సైట్, ఎంఐ హోం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షియోమీ పార్టనర్ రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
రెండు రకాల (4జీ, 5జీ) రెడ్మీ12 సిరీస్ ఫోన్లు 6.79-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2460 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటాయి. 450 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. స్క్రీన్లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తాయి.
రెడ్మీ12 4జీ ఫోన్ ఒక్టాకోర్ మీడియా టెక్ హెలియో జీ88 ఎస్వోసీ, రెడ్మీ12 5జీ ఫోన్ ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్నాయి. రెండు ఫోన్లలోనూ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకు స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 12 జీబీ, 16 జీబీ వరకు వర్చువల్‌గా రామ్ పెంచుకోవడానికి ఫోన్లు సపోర్ట్ చేస్తాయి.
రెడ్మీ12 4 జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ విత్ మాక్రో సెన్సర్ కెమెరా కలిగి ఉంటాయి.
రెడ్మీ12 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ మాక్రో లెన్స్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 4జీ అండ్ 5జీ ఫోన్లు 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటాయి.
రెడ్మీ12 4జీ అండ్ 5జీ ఫోన్లు 4జీ, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, వీ5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్స్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు కలిగి ఉంటాయి.