హైదరాబాద్, ఫిబ్రవరి 21 : దేశవ్యాప్తంగా యాపిల్ ఫోన్లను విక్రయిస్తున్న రెడింగ్టన్.. ఐఫోన్లపై భారీ రాయితీ కల్పిస్తున్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ 16ఈపై పలు బ్యాంకుల కార్డులపై రూ.4 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికీ ఈ ప్రత్యేక ఆఫర్ వర్తించనున్నది. అలాగే రూ.6 వేల వరకు ఎక్సేంజ్ బోనస్ పొందవచ్చును.