Telegram : మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సీఈవో పవెల్ దురోవ్‌ను ఫ్రాన్స్‌లోని లీ బగెట్ ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రైవేట్ జెట్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేశారు. మెసేజింగ్ యాప్‌నకు జారీ చేసిన ఓ వారెంట్ కింద టెలిగ్రాం సీఈవోను ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రాంపై నేర కార్యకలాపాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆయన అరెస్ట్‌కు దారితీసిందని చెబుతున్నారు.
టెలిగ్రాంను చట్టవిరుద్ధ కార్యకలపాలకు వినియోగించుకునేందుకు నిరోధించేందుకు సరైన చర్యలు చేపట్టడంలో ఆయన విఫలమయ్యారని అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను టెలిగ్రాం తోసిపుచ్చింది. సీఈవో తప్పించుకుని తిరగడం లేదని, ఆయన అదృశ్యం కాలేదని పేర్కొంది. మరోవైపు దురోవ్‌పై మోసం, డ్రగ్ ట్రాఫికింగ్, వ్యవస్ధీకృత నేరం, ఉగ్రవాదానికి ఊతం సహా పలు ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్ అధికారులు చేసిన ఆరోపణలన్నింటినీ టెలిగ్రాం కొట్టిపారేసింది.
ఈ ఆరోపణలు అసంబద్ధమైనవని తోసిపుచ్చింది. టెలిగ్రాం సీఈవో పవెల్ దురోవ్ అజ్ఞాతంలో లేరని, ఆయన తరచూ యూరప్‌లో పర్యటనలు చేస్తుంటారని తెలిపింది. ప్లాట్‌ఫాంపై జరిగే వేధింపులు, అవకతవకలకు కంపెనీని, దాని యజమానులను బాధ్యులను చేయడం అసంబద్ధమని స్పష్టం చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది యూజర్లు కీలక సమాచారానికి వనరుగా, కమ్యూనికేషన్ సాధనంగా టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సమస్యకు సరైన పరిష్కారం కోసం తాము వేచిచూస్తున్నామని, టెలిగ్రాం మీ అందరితో ఉంటుందని కంపెనీ ఓ పోస్ట్‌లో పేర్కొంది.
Read More :
Telangana Journalists | మాపై దాడులు ఆపండి.. రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టుల నిరసన