Realme C51 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ త్వరలో భారత్ మార్కెట్లో తన రియల్మీ సీ 51 (Realme C51) ఆవిష్కరించనున్నది. కార్బన్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ షేడ్స్‌లో రియల్మీ సీ 51 రాబోతున్నది. ఫ్రంట్‌లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే ఉంటుంది. యూనిసోక్ టీ 612 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తుందని సమాచారం. 4 జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మార్కెట్లోకి వస్తుంది. ఆపిల్ డైనమిక్ ఐలాండ్‌లో మాదిరిగా రియల్మీ సీ 51 ఫోన్లో ‘మినీ క్యాప్సూల్’ వస్తుందని సమాచారం. ఇంతకుముందు రియల్మీ తన రియల్మీ సీ55, రియల్మీ నార్జో ఎన్53 ఫోన్లలో మినీ క్యాప్సూల్ వాడారు.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్-13 బేస్డ్ రియల్ మీ యూఐ టీ-ఎడిషన్ వర్షన్ మీద పని చేస్తుంది రియల్మీ సీ51. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో రెండు టిగా బైట్ల వరకు ఇంటర్నల్ స్టోరేజీ పెంచుకోవచ్చు.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ గల రియల్మీ సీ51 ఫోన్లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెకండరీ షూటర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫోన్ వస్తుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.