Realme 11 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన ‘రియల్మీ11 5జీ (Realme 11 5G)’ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో సోమవారం ఆవిష్కరించింది. ఇటీవలే రియల్మీ11 (Realme 11 5G) సిరీస్ ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్లలోకి తీసుకొచ్చిన రియల్ మీ11 5జీ (Realme 11 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ప్రాసెసర్, 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ రేర్ కెమెరాతో వచ్చింది. 6.72-అంగుళాల స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ 67వాట్ల సూపర్ వూక్ చార్జింగ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కలిగి ఉంటది.
రియల్ మీ11 5జీ (Realme 11 5G) ఫోన్ ధర భారత్‌లో దాదాపు రూ.24 వేలలోపు (8990 ఎన్టీడీ- న్యూ తైవాన్ డాలర్లు) ఉంటుంది. డాన్ గోల్డ్, మూన్ నైట్ డార్క్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బుధవారం నుంచి తైవాన్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి.
రియల్ మీ11 5జీ ఫోన్ (Realme 11 5G) ఆండ్రాయిడ్ -13 బేస్డ్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్ మీద పని చేస్తుంది. ఈ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) శాంసంగ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అండ్ 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ (MediaTek Dimensity 6100+) విత్ 8జీబీ రామ్-వర్చువల్‌గా రామ్ కెపాసిటీ పెంచుకోవచ్చు.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న రియల్ మీ11 5జీ (Realme 11 5G) ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఎఫ్/1.75 అపెర్చర్, 83.6 -డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా విత్ ఎఫ్/2.4 అపెర్చర్ అండ్ 89.1 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎఫ్2.45 అపెర్చర్‌తో కలిగి ఉంటుంది.
8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ గల ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌తో స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 5జీ కనెక్టివిటీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, గైరోస్కోప్, యాక్సెలరోమీటర్, ఈ-కంపాస్ సెన్సర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటుంది.