ముంబై, అక్టోబర్ 7: భారతీయ రిజర్వ్‌బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యింది. ‘ఈ-రుపీ’గా వ్యవహరించే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని త్వరలో పైలట్ లాంఛ్ చేయనున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. కేంద్ర బ్యాంకులు డిజిటల్ రూపంలో జారీచేసే కరెన్సీ నోట్లను సీబీడీసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ రుపీని ఆవిష్కరించనున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిచ్చేదృష్టితో కొన్ని సందర్భాల్లో వినియోగానికి మాత్రమే పనికివచ్చే ఈ-రూపీ..పేమెంట్ సిస్టమ్స్‌ను మరింత
ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ మనీ, త్వరలో విడుదల చేయనున్న సీబీడీసీ వ్యత్యాసాన్ని ఆర్బీఐ వివరిస్తూ సీబీడీసీ రిజర్వ్‌బ్యాంక్ లయబిలిటీగా ఉంటుందని (చెల్లింపు చేయాల్సిన విలువ) తెలిపింది. దీనిని కేంద్ర బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో అప్పుగా చూపిస్తారు. చెల్లింపు సాధనంగా, లీగల్ టెండర్‌గా, ప్రజలు, సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు సురక్షితంగా స్టోర్ చేసుకోవొచ్చు. వాణిజ్య బ్యాంకుల్లో లభించే డబ్బుకు స్వేచ్ఛగా సీబీడీసీని మార్పిడి చేసుకోవొచ్చు.