Reporate | రెపోరేట్’లో నో చేంజ్.. అక్టోబర్ తర్వాత ఇలా జరుగుతుందా..!
Reporate | ఏప్రిల్ ద్రవ్యోల్బణం 18 నెలల దిగువకు పడపోవడంతో ఈ నెలలో కూడా ఆర్బీఐ రెపోరేట్ పెంచకపోవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.
Reporate | ఏప్రిల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతోపాటు మున్ముందు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ దఫా ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రెపోరేట్ 6.50 శాతంగా ఉంది. ఈ నెల 6-8 తేదీల మధ్య ద్రవ్య పరపతి సమీక్ష జరుగుతుంది. ఈ నెల 8న ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడిస్తారు.
గతేడాది మే నుంచి వరుసగా వడ్డీరేట్లు పెంచడం వల్లే ద్రవ్యోల్బణం దిగి వస్తున్నదంటున్నారు నిపుణులు. ఏప్రిల్ ద్రవ్యోల్బణం 4.70 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇది 18 నెలల కనిష్ట స్థాయి. అంతే కాదు.. వరుసగా రెండో నెలలో ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నియంత్రణ పరిధిలోనే నమోదైంది. మున్ముందు కూడా ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రణ స్థాయి 2-6 శాతం లోపే నమోదవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అంచనా వేశారు.
సమావేశ నిర్ణయాలను జూన్ 8న ప్రకటించనున్నారు. చివరిసారి ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రెపోరేటు (repo rate)లో ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతం దగ్గర కొనసాగించారు. దీంతో 2022 మే నుంచి అనుసరిస్తున్న రేట్ల పెంపు ప్రక్రియకు విరామమిచ్చినట్లయింది. గతేడాది మే నుంచి వరుస పెంపులతో రెపో రేటు 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
మే నెల ద్రవ్యోల్బణం కూడా మరింత దిగి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్ అవుతున్నందున ద్రవ్య లభ్యత కొనసాగుతుందని మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. అక్టోబర్ తర్వాత ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపోరేట్ 25-50 బేసిక్ పాయింట్లు తగ్గ వచ్చునన్నారు. కేవలం ద్రవ్యోల్బణంతోపాటు ఎకనమిక్ గ్రోత్, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సుస్థిరత, జాతీయ-అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రెపోరేట్ పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- rbi
- Reporate
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

